దేశాభివృద్ధిలో మహిళల భూమిక ఎంతో ముఖ్యం
- జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ
విజయవాడ : మనం ఏ రంగంలో అయినా అభివృద్ధిని పూర్తిగా సాధించాలంటే, అందులో మహిళల భూమిక ఎంతో ముఖ్యం అని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అందులోనూ దేశ ప్రగతికి న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీ కార్యాయలంలో విజయవాడకు చెందిన పలువురు అడ్వకేట్లు జై భారత్ నేషనల్ పార్టీలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు సమక్షంలో పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మహంత్ నాయర్, సెక్రటరీ బి.వి.అరుణాదేవి, ఎన్టీయార్ జిల్లా కన్వీనర్ సత్య వసుంధరల ఆధ్వర్యంలో అడ్వకేట్లు వసుంధర, గర్రె అనూరాధ, జె.నాగమల్లేశ్వరి, ఎం.సంధ్యారాణి, ఎం.కిరణ్ కుమార్, కె.శ్రీకాంత్, ఓ. సునీత, పొట్నూరి శారద తదితరులు జై భారత్ నేషనల్ పార్టీలో చేరారు. వీరంతా ఏపీ వ్యాప్తంగా పార్టీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మహంత్ నాయర్, సెక్రటరీ బి.వి.అరుణాదేవిల ఆధ్వర్యంలో పనిచేస్తారని అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. జైభారత్ నేషనల్ పార్టీ ప్రజలతో, ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అంతా ఐక్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.
Comments