top of page

జై భారత్ నేషనల్ పార్టీ (JBNP) గురించి

జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో  జే డి లక్ష్మి నారాయణగా పేరొందిన విశ్రాంత ఐపిఎస్ అధికారి శ్రీ వి వి లక్ష్మి నారాయణ గారి చేత ప్రారంభించడం జరిగింది. ప్రస్తుత రాజకీయాలకు ఏకైక ప్రత్యమ్నాయంగా ప్రజల ముందుకు వచ్చినదే మన జై భారత్ నేషనల్ పార్టీ.

 

 

పార్టీ దృష్టి సారించిన అంశాలు:

 

1. అందరికీ సామాజిక భద్రత,  అందునా అణగారిన వర్గాల పై ప్రత్యేక శ్రద్ధ.

 

2. రాజకీయమే ధ్యేయంగా సాగుతున్న అభివృద్ధి నుండి అభివృద్ధే ధ్యేయంగా రాజకీయాన్ని  ముందుకు నడుపుతూ తద్వారా సుపరిపాలనకు బాటలు వేయటం

 

3. ప్రతి గ్రామంలో కీలక సామర్థ్యాన్ని వెలికి తీసి తద్వారా  వాటిని స్వీయ సమృద్ధిగా తీర్చిదిద్ది గాంధీజీ కలలను నెరవేర్చటం.

 

4. సాంకేతిక ఆధారిత వ్యవసాయం ద్వారా రైతాంగాన్ని లాభసాటి గా మారుస్తూ రైతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉండటం

 

5. యువత నైపుణ్యాన్ని అభివృద్ధి చేయటం మరియూ వారిలో వ్యాపార దక్షితను పెంపొందించటం

 

6. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న నైపుణ్యాన్ని ఒక సమగ్రమైన రూపానికి తీసుకు రావటం

 

7. సమ్మిళిత వృద్ధిని సాధించటం మరియు వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం

 

8. విలువలతో కూడిన విద్యను బాలలకు అందించటం

JD Lakshmi Narayana Supporters

మీడియా

జెడి లక్ష్మీ నారాయణ

మా నాయకుడు

శ్రీ వి వి లక్ష్మి నారాయణ ఏప్రిల్ 3, 1965లో వైస్సార్ కడప జిల్లాలో జన్మించారు. 1990లో ఐపిఎస్ కి  ఎంపికై మహారాష్ట్ర కేడర్లో అత్యుత్తమ సేవలను అందించారు.

ఎన్ఐటి వరంగల్,  ఐఐటి మద్రాస్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో  విద్యను అభ్యసించిన ఆయన, డిఐజి, యాంటీ టెర్రరిసం స్క్వాడ్,  ముంబాయి  మరియూ సిబిఐ జాయింట్ డైరెక్టర్,  హైదరాబాద్ లాంటి కీలకమైన పదవులలో మెరిశారు. 2018 లో ఐపిఎస్ కి  స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తదుపరి జీవితాన్ని ప్రజా క్షేత్రంలో గడపాలని నిర్ణయించుకున్నారు.

 

పదవిలో ఉన్నప్పుడే ఉద్యోగ బాధ్యతలతో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. 61 సార్లు రక్త దానం చేశారు, 15000 మొక్కలను నాటి సంరక్షించారు.

 

ఎన్నో సామాజిక ఉపన్యాసాలు తత్సంబంధమైన కార్యక్రమాల ద్వారా ముప్పై లక్షలకు పైగా యువతకు ప్రేరణగా నిలిచారు.

 

ప్రజా సంక్షేమం మరియు సమాజ అభివృద్ధి పట్ల నిబద్ధతకు ఉదాహరణలుగా ఆయన చేపట్టిన రెండు కార్యక్రమాలు కలికితురాయిలుగా నిలుస్తాయి, అవి: గ్రామాలను దత్తత తీసుకునే కార్యక్రమం మరియు జాయిన్ ఫర్  డెవలప్మెంట్ ఫౌండేషన్.

మా విజన్

సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమన్వయ పరుస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మేము కంటున్న కల.

సామరస్యపూర్వకమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన సమాజాన్ని నిర్మించడమే మా లక్ష్యం. అది నెరవేరాలంటే స్వయం సమృద్ధ సమాజాన్ని నిర్మించాలి, నైపుణ్య ఆధారిత వ్యాపార దక్షితను ప్రజల్లో పెంపొందించాలి. అందుకోసం చేపట్టబోయే కార్యక్రమాలతో అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయ పరుస్తూ వాస్తవాధారిత ప్రజా విధానాన్ని రూపొందించి ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన విత్త విధానాన్ని తయారు చేయటం జరుగుతుంది.

చివరగా మా కల, సుసంపన్నమైన రైతాంగాన్ని నిర్మించడం, నాణ్యమైన వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం, రాజకీయ ఔచిత్యాన్ని పెంపొందించడం, సుపరిపాలన అందించడం మరియు విలువలు, విశ్వసనీయత, దార్శనికత ఉన్న నాయకులను తయారు చేయడం

మన రాజ్యాంగం

మా మిషన్

భారత దేశాన్ని పునరుత్థానం చేయాలన్న మా లక్ష్యం పౌరుల భాగస్వామ్యం,  ప్రజా సంప్రదింపులు మరియు నవ్యత, సాంకేతికత ద్వారానే సాధ్యం అవుతుంది.

 

మా దృష్టి ప్రతి జిల్లా నైపుణ్యాలని సంధానిస్తూ పారదర్శకతతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ నాయకుల్లో జవాబుదారీతనం పెంపొందించి తద్వారా సమాజ అభివృద్ధి సాధించడం పైనే ప్రధానంగా వుంది. అలుపులేని కార్యదక్షతతో సుపరిపాలనకై పరిశ్రమించి రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చటమే మా యొక్క మిషన్.

ఈ కష్టతరమైన లక్ష్యం వెనుక సమాజం లోని ప్రతి వర్గాన్ని స్వయం సమృద్ధిగా మలచి వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా తీర్చిదిద్దడం అనే మా కల దాగుంది.

ప్రస్తుత భారత దేశం సంధి కాలంలో వుంది. డెమోగ్రాఫిక్ డివిడెండ్ మన కళ్ల ముందర అందుకోమని చేతులు జాపి నిలబడింది. అది అందుకోవాలంటే యువత లో  నైపుణ్యాన్ని పెంచి వారి స్వీయ అభివృద్ధి తద్వారా దేశాభివృద్ధి సాధించడం ఎంతో అవసరం. ఇది చేజారిపోతే భావితరాలకు తీరని అన్యాయం చేసినవారం అవుతాము. అందుకే సరిగ్గా ఈ సంధి కాలంలో మన పార్టీ పై లక్ష్యాన్ని మిషన్గా చేసుకొని మీ ముందుకు వచ్చింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ

మా బాస్‌లు

© వికీమీడియా కామన్స్

రైతులు, కార్మికులు, మహిళలు & పిల్లలు మా బాస్‌లని మేము నమ్ముతున్నాము

మా వాగ్దానాలు

1. మన పార్టీ  ఎంపిలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళల్లో అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నాము.

2. వారు అనుక్షణం రాజనీతి విలువలకు కట్టుబడి ఉంటారని హామీ ఇస్తున్నాము.

 

3.  వారు శాసన సభ నుంచి వాకౌట్ చేయరు మరియు సభా సమయాన్ని వృధా చేయరు అని హామీ ఇస్తున్నాము.

 

4. నియోజకవర్గంలోని సమస్యలను సభ ముందు ఉంచి వాటి పరిష్కారానికి తీసుకునే చర్యల యొక్క పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తామని హామీ ఇస్తున్నాము. 

 

5. సభలోని చర్చలు, ప్రశ్నోత్తరాలు, హామీలు ఏరోజుకారోజు సామాజిక మాధ్యమాల ద్వారా మీ ముందు ఉంచుతాము.

 

6. నియోజకవర్గానికి కేటాయించిన నిధులను ప్రతి రూపాయి జవాబుదారీతనంతో ఖర్చు పెట్టేలాగా చూస్తూ ప్రజల నుండి నిరంతర అభిప్రాయ సేకరణ చేస్తూ తద్వారా విధాన పరమైన మార్పులను తీసుకు వస్తామని హామీ ఇస్తున్నాము.

జై భారత్ నేషనల్ పార్టీలో చేరండి

ప్రకాశవంతమైన, మరింత సమానమైన భవిష్యత్తు వైపు ఈ ప్రయాణంలో మాతో చేరండి. కలిసికట్టుగా, ప్రగతికి అవధులు లేని దేశాన్ని మనం నిర్మించగలం

జై భారత్! జై ఆంధ్రప్రదేశ్!

రోజువారీ నవీకరణలు

రోజువారీ నవీకరణల కోసం, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి

మా మేనిఫెస్టో రాయండి

ప్రియమైన పౌరులారా, మీ భవిష్యత్తుకు రూపశిల్పులుగా ఉండండి! మీ నియోజకవర్గం కోసం మీ ఆకాంక్షలను పంచుకోవడం ద్వారా జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోకు సహకరించండి.

స్థానిక అవసరాలను తీర్చండి, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు మరియు పర్యావరణ సమస్యలు వంటి సమస్యలపై పరిష్కారాలను ప్రతిపాదించండి.

 

మీ ఇన్‌పుట్ ముఖ్యమైనది, మీ వాయిస్‌ని నిజంగా సూచించే విధానాలను రూపొందించండి. మీ ఆలోచనలను పంచుకోండి మరియు సామూహిక దృష్టికి అద్దం పట్టే మానిఫెస్టోను రూపొందించడంలో సహాయపడండి.

 

కలిసి, ప్రతి నివాసి యొక్క కలలు మరియు ప్రాధాన్యతలను ప్రతిబింబించే భవిష్యత్తును నిర్మించుకుందాం. మీ నిశ్చయం మన శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి పునాది.

This channel is coming soon!
bottom of page