top of page

మన అధినాయకులు

© వికీమీడియా కామన్స్

జై భారత్ నేషనల్ పార్టీ రైతులు, కార్మికులు, మహిళలు  మరియు బాలలే మన జాతి భావి నిర్మాతలని ధృడమైన నమ్మకంతో స్థాపించటం జరిగింది. ఈ సత్యాన్ని అవలోకనం చేసుకుని నిష్కల్మషంగా పైన పేర్కొన్న వర్గాలని ఓటర్లుగా కాక మా విధానాలకు ప్రాధాన్యతలకు మార్గదర్శకత్వం వహించే అధినాయకులుగా నమ్ముతున్నాము.

 

మన రైతులే జాతికి వెన్నెముక. వారి స్వేదం మన కడుపు నింపుతోంది. మన పార్టీ మొదటి ప్రాధాన్యత వారి రెక్కల కష్టానికే.

 

దేశ పురోగతి కార్మికవర్గ శ్రమ పైనే ఆధారపడి ఉంది. వారి సంక్షేమంలోనే జాతి సంక్షేమం ఇమిడి ఉంది. అందుకే కార్మిక వర్గ ఆకాంక్షలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం మన పార్టీ లక్ష్యం.

 

జాతిలో సగం స్త్రీలు. జాతి నిర్మాణంలో వారి పాత్ర అనిర్వచనీయమైనది. వారి గొంతుకలకి మన పార్టీ ఒక వేదిక అవుతోందని సగర్వంగా ప్రకటిస్తున్నాము.

 

బాలలు మన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి భావి తరాలకు ఒక స్ఫూర్తివంతమైన సమాజాన్ని అందివ్వబోతున్నారు. వారి కలలకు ఆశయాలకు మన పార్టీ ఒక ఊతం కాబోతుంది.

 

పైన పేర్కొన్న నాలుగు వర్గాల సమ్మిళిత కృషితో దేశం సుదూర తీరాలకు చేరుకోబోతుంది. వారి ఉన్నతి దేశ ప్రగతికి చోదకశక్తి అని మేము నమ్ముతున్నాము. మన పార్టీ వారికి గొంతుకలనిచ్చి ఉమ్మడిగా అభివృద్ధిని సాధించాలని సంకల్పించింది.

 

ఈ మన అధినాయకుల కలలు సాకారం చేస్తూ భూతల స్వర్గాన్ని తలపించే బంగారు భవిష్యత్తులోకి  జాతిని నడిపించే ఏకైక పార్టీ మన జై భారత్ నేషనల్ పార్టీ

bottom of page