top of page
మా హామీలు
మా హామీలు:
1. మన పార్టీ ఎంపిలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళల్లో అందుబాటులో ఉంటారని హామీ ఇస్తున్నాము.
2. వారు అనుక్షణం రాజనీతి విలువలకు కట్టుబడి ఉంటారని హామీ ఇస్తున్నాము.
3. వారు శాసన సభ నుంచి వాకౌట్ చేయరు మరియు సభా సమయాన్ని వృధా చేయరు అని హామీ ఇస్తున్నాము.
4. నియోజకవర్గంలోని సమస్యలను సభ ముందు ఉంచి వాటి పరిష్కారానికి తీసుకునే చర్యల యొక్క పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తామని హామీ ఇస్తున్నాము.
5. సభలోని చర్చలు, ప్రశ్నోత్తరాలు, హామీలు ఏరోజుకారోజు సామాజిక మాధ్యమాల ద్వారా మీ ముందు ఉంచుతాము.
6. నియోజకవర్గానికి కేటాయించిన నిధులను ప్రతి రూపాయి జవాబుదారీతనంతో ఖర్చు పెట్టేలాగా చూస్తూ ప్రజల నుండి నిరంతర అభిప్రాయ సేకరణ చేస్తూ తద్వారా విధాన పరమైన మార్పులను తీసుకు వస్తామని హామీ ఇస్తున్నాము.