top of page

జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ - జై భార‌త్ జై జై భార‌త్

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party


జేడీ గారి అనుభ‌వాల స‌మాహారం

- స‌క్సెస్ ఫుల్ ఫార్మూలా గ్రంథావిష్క‌ర‌ణ‌

జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షులు శ్రీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ గారిపై ప్ర‌ముఖ ర‌చ‌యిత, అధ్యాప‌కులు పుసులేటి స‌త్య‌న్నారాయ‌ణ సేక‌రించిన అమూల్య‌మైన వ్యాసాల పుస్త‌కాన్నిఘ‌నంగా ఆవిష్క‌రించారు. విజ‌య‌వాడ‌లోని జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ గారు ఈ పుస్త‌కాన్ని ర‌చ‌యిత స‌మ‌క్షంలో ఆవిష్క‌రించారు. ఐ.పి.ఎస్. అధికారిగా, సి.బి.ఐ. జాయింట్ డైరెక్ట‌ర్ గా వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ గారి అనుభ‌వాల‌ను, ఆయ‌న‌పై ప్ర‌చురిత‌మైన అంశాల‌ను వ‌డుపుగా సేక‌రించి, గ్రంధ‌స్తం చేసిన ప‌సుపులేటి స‌త్య‌న్నారాయ‌ణ గారిని అభినందించారు. పోలీసు క‌ర్త‌వ్యం, ఉపాధ్యాయ బోధ‌న‌, యూత్ ఎన్ఫోర్స్ మెంట్, మ‌నిషిలో మార్పు వంటి అంశాల‌ను ఇందులో స్పృశించారు. పిల్ల‌ల‌ను పూల‌బాట‌లో ఎలా న‌డిపించాలి? మార్పు మ‌న నుంచే మొద‌ల‌వ్వాలి అనే అనుస‌ర‌ణీయ భావ‌న‌తో ర‌చించిన ఈ పుస్త‌కం పాఠ‌కుల మ‌న్న‌న‌ల‌ను పొందుతోంది.

1 view0 comments

Comments


bottom of page