top of page

జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ - జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీలో భారీ చేరిక‌లు

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party


జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీలో మంగ‌ళ‌వారం భారీగా చేరిక‌లు జ‌రిగాయి. వంద‌లాది కార్య‌క‌ర్త‌ల‌తో విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యంలో అధ్య‌క్షుడు శ్రీ వి.వి. ల‌క్ష్మీనారాయ‌ణ సమ‌క్షంలో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల కార్య‌క‌ర్త‌లు పార్టీలో చేరారు. వీరిలో ప‌లువురికి కీల‌క బాధ్య‌త‌ల‌ను అధ్య‌క్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ అప్ప‌గించారు. షేక్ నైనాకు గుంటూరు ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ గా, షేక్ భాషాకు తెనాలి నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ గా, ఎడ‌వ‌ల్లి వీర బ‌దుల్లాకు గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం క‌న్వీన‌ర్ గా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలాగే, గుంటూరు, ప్ర‌కాశం జిల్లా కో-ఆర్డినేట‌ర్ గా షేక్ ఖాద‌ర్ మ‌స్తాన్ వ‌లీ, క‌ర్నూలు జిల్లా యువ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా క‌టిక ఇస్మాయిల్, క‌ర్నూలు పార్ల‌మెంట‌రీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా పానుగంటి శివ‌కుమార్, క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య‌క‌ర్తగా దారూరు న‌రేష్ ల‌ను నియ‌మించారు. ఈ చేరిక‌ల కార్య‌క్ర‌మంలో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోతిన వెంక‌ట రామారావు, కార్య‌ద‌ర్శి ఎం. అరుణ, లీగ‌ల్ సెల్ ప్రెసిడెంట్ మ‌హంత్ నాయ‌ర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.వి.అరుణ‌, ఎన్.టి.ఆర్. జిల్లా నాయ‌కురాలు బి. స‌త్య వ‌సుంధ‌ర‌, అడ్వ‌కేట్లు రాధిక శ్రీధ‌ర‌న్, ఐ.విజ‌య దుర్గ‌, కె. బాల చాముండేశ్వ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

1 view0 comments

Comments


bottom of page