top of page

జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ - జై భార‌త్ పార్టీ సాంగ్స్ రిలీజ్

Writer's picture: Jai Bharat National PartyJai Bharat National Party


జై భార‌త్ పార్టీ సాంగ్స్ రిలీజ్

- అనంత శ్రీరామ్ లిరిక్స్, చంద్ర‌లేఖ మ్యూజిక్ సూప‌ర్ హిట్

- రెండు ఉద్య‌మ పాట‌ల్నివిడుద‌ల చేసిన జై భార‌త్ అధ్య‌క్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ‌

- జ‌న‌జ‌న జ‌న‌జ‌న‌ జై భార‌త్ అన్న అనంత శ్రీరామ్

- ప్ర‌జ‌లే రాజులుగా మ‌న జై భార‌త్ పార్టీ అనే రెండో పాట‌

విజ‌య‌వాడ‌: జ‌నాల్ని క‌దిలించే రెండు ఉద్య‌మ పాట‌ల్ని జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ బుధ‌వారం సాయంత్రం రిలీజ్ చేసింది. జ‌న‌జ‌న జ‌న‌జ‌న‌ జై భార‌త్, జీవ‌న స్ర‌వంతికి జై భార‌త్ అంటూ, ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత అనంత శ్రీరామ్ సాహిత్యంతో, చంద్ర‌లేఖ మ్యూజిక్ తో విడుద‌ల చేసిన తొలి సాంగ్ అంద‌రినీ అమితంగా ఆక‌ట్టుకుంటోంది. దీనితో పాటు ప్ర‌జ‌లే రాజులుగా మ‌న జై భార‌త్ పార్టీ అనే రెండు పాట‌ల‌ను పార్టీ అధ్య‌క్షుడు వి.వి.ల‌క్ష్మీనారాయ‌ణ బుధ‌వారం విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాల‌యంలో విడుద‌ల చేశారు. జ‌న స‌ముద్ర జై భార‌త్ నిన‌దిస్తోంది నింగిని చీల్చుకుని అనే పాట‌ను సింహా పాడారు. ప్ర‌జ‌లే రాజులుగా మ‌న జైభార‌త్ పార్టీ అనే రెండో పాట‌ను క‌విశేఖ‌ర మ‌న‌శ్రీ సాహిత్యం, చంద్ర‌లేఖ సంగీతం, బ‌ల్లేప‌ల్లి మోహ‌న్ గాత్రం అందించారు. ఈ రెండు పాట‌ల‌ను పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోతిన వెంక‌ట రామారావు, నాయుడు శిరీషా రాణి విడుద‌ల చేయ‌గా, పార్టీ నాయ‌కులు కొడాలి ఏకాంబ‌రం, ఆకురాతి వెంక‌ట అశ్వ‌ని, క‌విత‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

2 views0 comments

Comments


bottom of page