ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం జై భారత్ నేషనల్ పార్టీ ముందడుగు వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. మహిళలు, యువత, విద్యావంతులు, అన్ని వర్గాల ఓటర్లంతా తమ పార్టీకి అండగా నిలవాలని ఆయన కోరారు.శ్రీశైల నియోజకవర్గ అభ్యర్థి సికిందర్ భాషా ఆధ్వర్యంలో స్థానిక పోలేరమ్మ ఆలయంలో పూజలు చేసిన జేడీ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్, అంబేదర్కర్ సర్కిల్ వరకు ఊరేగింపుగా చేరి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
top of page
bottom of page
Comments