సంఘ మిత్రులను సన్మానించిన శ్రీ. జేడీ. లక్ష్మీనారాయణ గారు
విజయవాడ: నాడు సుభాష్ చంద్ర బోస్.. నేడు మన జేడీ లక్ష్మీనారాయణ అంటూ కొనియాడుతున్న వీరిద్దరూ ప్రాణ మిత్రులు.. అంతే కాదు, సంఘానికి మిత్రులు. రైతువారీగా ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవడమే కాదు.. తమ స్వగ్రామం కష్టాలను తీర్చేందుకు కలిసి కదిలారు. గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసిన వీరు.. ప్రజల కోసం పనిచేస్తున్న జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణను వెతుక్కుంటూ, విజయవాడకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో ఆయన్ని కలిసి తమ అభిమానాన్ని చాటారు.
ఈ ఇద్దరు రైతుల పేర్లు బొబ్బిలి కోటిరెడ్డి, గోపు తిరుపతి స్వామి. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం, మాచవరం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు స్నేహితులు కలిసి, తమ గ్రామం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సొంతంగా చేశారు. మాచవరంలో సచివాలయం కట్టించారు. హాస్పిటల్, అంగన్ వాడీ స్కూలు కట్టించారు. సీసీ రోడ్డు, డ్రైనేజి నిర్మించారు. తమ స్థలం 20 సెంట్లు గ్రామ అవసరాల కోసం దానం చేశారు. ఈ ఇద్దరు మిత్రులకు మొదటి నుంచి దేశ స్వతంత్రం కోసం పనిచేసిన సుభాష్ చంద్ర బోస్ అంటే ఇష్టం. అలాగే, దేశ ప్రయోజనాల కోసం ఐ.సి.ఎస్. గా, సి.బి.ఐ. జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన వి.వి.లక్ష్మీనారాయణ అంటే, అమితమైన అభిమానం.
జై భారత్ పార్టీ పెట్టారని వచ్చేశాం..
జై భారత్ నేషనల్ పార్టీని పెట్టి, ప్రజల కోసం జేడీ లక్ష్మీనారాయణ పోరాడుతున్నారని తెలిసి, నేరుగా ఆయన్ని అభినందించేందుకు విజయవాడ పార్టీ కార్యాలయానికి కోటిరెడ్డి, తిరుపతి స్వామి గురువారం వచ్చేశారు. జేడీగారిపై తమకు వ్యక్తిగతంగా అభిమానం ఉందని, ప్రజల కోసం, ప్రజాసేవ కోసం నిజాయితీగా పనిచేస్తున్న వి.వి.లక్ష్మీనారాయణ గారిని కలిసి సన్మానించేందుకు వీరిద్దరు వస్తే, ఆ ఇద్దరు రైతుల సేవా తత్పరతను చూసి, జేడీ ముగ్దులయ్యారు. తానే కోటిరెడ్డి, తిరుపతి స్వామిలను శాలువా కప్పి సన్మానించారు. గ్రామం కోసం ఇద్దరు రైతులు చేసిన సేవ ఎంతో ఆదర్శం అని, అలాంటి వారిని సంఘం గుర్తించి, సన్మానించాలని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Comments