విజయవాడ:
విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ గా ఇల్లిపిల్లి అనిల్ కుమార్ నియమితులయ్యారు. విజయవాడలోని జైభారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. అనిల్ కుమార్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎంటెక్, పిహెచ్ డి చేసిన అనిల్ కుమార్ విద్యావంతుడిగా జైభారత్ పార్టీ ఆశయాలను యువతలోకి అత్యంత ప్రభావవంతంగా తీసుకెళతారని పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు,
రాష్ట్ర కో-ఆర్డినేటర్ రవికిరణ్ పాల్గొన్నారు.
Commenti