యువతోనే ఓటరు చైతన్యం సాధ్యం: జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ
విజయవాడ\తిరుపతి\పొద్దుటూరు: దేశ భవితకు యువతే సారధులని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో యువతలో నైరాశ్యాన్ని పోగొట్టి, స్ఫూర్తి నింపేందుకే జై భారత్ నేషనల్ పార్టీని నెలకొల్పామన్నారు. విజయవాడలో జైభారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో గురువారం భారీగా చేరికలు జరిగాయి. జైభారత్ రాయలసీమ యూత్ వింగ్ అధ్యక్షుడిగా శీలంశెట్టి వెంకట భార్గవ్ సాయిని నియమిస్తూ, జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కండువాలను కప్పారు. ఆయనతోపాటు జైభారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు సమక్షంలో, యువ నాయకులు సుభాన్, వెంకటరమణ, సాయికిరణ్, తిరుపాల్ తదితరులు యువజన విభాగంలో చేరారు. తిరుపతి, ఎస్.వి.యూనివర్సిటీ, అనంతపూర్, చిత్తూరు, కడప, కర్నూలూ కేంద్రాలుగా తాము యువజన విభాగాన్ని విస్తరించనున్నట్లు రాయలసీమ యూత్ వింగ్ అధ్యక్షుడిగా శీలంశెట్టి వెంకట భార్గవ్ సాయి చెప్పారు.
Opmerkingen