జై భారత్ ఘన విజయం.. జేడీ సార్ జయహో!
తెలంగాణాలోనూ జై భారత్ కు బ్యాటరీ టార్చ్ గుర్తు
మహారాష్ట్రలో గ్యాస్ స్టవ్ గుర్తు కేటాయింపు
దేశంలో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో జై భారత్ ఘన విజయం సాధించింది. జేడీ సార్ జయహో! అని జయకేతనం ఎగురవేసే, తరుణం ఆసన్నం అయింది. ఏపీలోనే కాదు తెలంగాణాలోనూ కామన్ గుర్తు బ్యాటరీ టార్చ్ ని పొంది, జై భారత్ నేషనల్ పార్టీ ఒక మైలు రాయిని దాటింది. జైభారత్ నేషనల్ పార్టీకి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, అటు తెలంగాణాలోనూ కామన్ గుర్తును కేటాయిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని ఆ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జేబీఎన్ పికి ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇపుడు తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇదే బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయిస్తూ, కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీ చేసింది. అంతే కాకుండా, అటు మహారాష్ట్రలో కూడా ఎన్నికల్లో పోటీకి అనుమతిస్తూ, ఎన్నికల గుర్తు గ్యాస్ స్టవ్ ను కేటాయించింది. తెలుగు రాష్ట్రాలలో ఒకే బ్యాటరీ టార్చ్ కామన్ గుర్తుపై తాము పోటీ చేయడం, గర్వంగా భావిస్తున్నామని జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు
留言