పశ్చిమలో జోరుగా జైభారత్ ప్రచారం
ఇంటింటి ప్రచారంలో పోతిన రాము
వన్ టౌన్ అభివృద్ధే లక్ష్యం: పోతిన రాము
విజయవాడ: జైభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ప్రచారం జోరుగా సాగుతోంది. నగరంలోని సితార సెంటర్ నుంచి, చిట్టినగర్ మార్కెట్ వరకు ఇంటింటికీ తిరిగి జైభారత్ మ్యానిఫెస్టోని పంచుతున్నారు. జేడీ లక్ష్మీనారాయణ పార్టీ తమదని, ఆయన మ్యానిఫెస్టో తూ.చ తప్పకుండా అమలు చేసి, పశ్చిమను ఏటా వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తామని పోతిన రాము పశ్చిమ ఓటర్లకు హామీ ఇస్తున్నారు. ప్రతి రోడ్డు కూడలి వద్ద ఓటర్లనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే, పశ్చిమలో స్మార్ట్ డ్రైనేజీ సిస్టం తెస్తామని, కొండ ప్రాంతంలో, ముఖ్యంగా వన్ టౌన్ లో సూపర్ స్పెషలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని వివరిస్తున్నారు. తమ డివిజన్ పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిపరిష్కారానికి కృషి చేస్తామని పోతిన రాము పేర్కొంటున్నారు.
Comments