విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్ త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ వారి తో విశాఖ నార్త్ నియోజకవర్గ జై భారత్ పార్టీ అభ్యర్థి, శ్రీ జేడీ లక్ష్మీ నారాయణ గారు తమ ప్రచారాన్ని తెల తెల వారుతున్న ఉదయ భానుడి కిరణాలతో పాటే ప్రారంభించారు. విశాఖ నార్త్ నియోజక వర్గంలో ప్రచారంలో జేడీ లక్ష్మీ నారాయణ గారు దూసుకు వెళ్లిపోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. జేడీ గారి ప్రచారం ఇతర రాజకీయ నాయకుల ప్రచారానికి ఎంతో భిన్నంగా ఉండడం తో ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనం పడుతున్నారు. జేడీ గారికి వస్తున్న ఈ అశేష ప్రజాదరణ చూస్తుంటే, రాబోవు ఎన్నికలలో ఈయన విజయం తధ్యం అని, కేవల మెజారిటీ మీద మాత్రమే పని చేయాలని ఓటరులు ముక్త కంఠం తో అంటున్నారు.
top of page
bottom of page
Commentaires