శ్రీశైల నియోజకవర్గం ప్రజల సమస్యల పై శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టులో జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ లో పార్టీ అధ్యక్షులు శ్రీ (జేడి) లక్ష్మి నారాయణ గారు, సయ్యద్ మహమ్మద్ సికిందర్ భాష గారు శ్రీశైల నియోజకవర్గం ప్రజల సమస్యల పై శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జై భారత్ నేషనల్ పార్టీ శ్రీశైల నియోజకవర్గ సమన్వయకర్త సయ్యద్ మహమ్మద్ సికిందర్ భాష అన్నారు. మరియు శ్రీ (జేడి) లక్ష్మి నారాయణ గారు, మాటలాడుతూ అభివృద్ధికి ఏటా వంద కోట్లు కేటాయిస్తామని, ప్రతి పంచాయతీకి 5 కోట్ల నిధులతోపాటు పది చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని లక్ష్మీనారాయణ ప్రకటించారు. పుట్టిన ప్రతి అమ్మాయి పేరు మీద ఎర్రచందనం చెట్లు నాటించి, 18 ఏళ్ళు నిండగానే ఆమెకు ఆదాయం అందేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. జైభారత్ నేషనల్ పార్టీకి ప్రజలు ఓటు వేసి, మూస రాజకీయాలకు స్వస్తిపలికి అభివృద్ధికి పట్టం కట్టాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
top of page
bottom of page
Comentários