వామపక్ష సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వి.వి.(జేడీ)లక్ష్మీనారాయణ గారు.
విజయవాడ :
కేంద్రంలో బీజేపీ వైఖరికి నిరసనగా, విజయవాడలో మంగళవారం జరిగిన వామపక్ష సదస్సులో జై భారత్ నేషనల్ పార్టీ అధినేత శ్రీ వి.వి.(జేడీ )లక్ష్మీనారాయణ గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆంద్రప్రదేశ్ ప్రయోజనాలకు అడ్డంకిగా మారిన కేంద్రంపై, ఏపీలోని పాలక, ప్రతిపక్షాలపై పోరాటాన్ని ప్రకటిస్తూ, సిపిఐ, సిపిఎం రాష్ట్ర సదస్సు నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ పార్టీతో పాటు, జేడీ లక్ష్మీనారాయణ గారు సారధ్యం వహిస్తున్న జైభారత్ నేషనల్ పార్టీని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ సదస్సులో మాట్లాడిన సిపిఐ కేంద్ర నాయకుడు నారాయణ గారితోపాటు, సిపిఐ నాయకుడు శ్రీనివాసరావు గారు వరకు అంతా, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారిని తమ ప్రసంగంలో ముఖ్యంగా ప్రస్తావించారు. ఆయన హయాంలో సిబిఐ సమర్ధంగా పనిచేసిందని, ఇపుడు కేంద్ర బీజేపీ చేతిలో సిబిఐ కీలుబొమ్మగా మారిందని వామపక్ష నేతలు ఆరోపించారు.
ప్రత్యేక హోదాపై గళమెత్తిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ.వి.వి.(జేడీ )లక్ష్మీనారాయణ గారు.
వామపక్షాల సభలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలపై, ప్రత్యేక హోదాపై గళమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించకుండా, విభజన హామీలను నెరవేర్చకుండా అన్యాయం చేస్తున్న కేంద్రానికి, రాష్ట్రంలో ఉన్న పాలక, ప్రతిపక్షాలు దాసోహం అయ్యాయని విమర్శించారు. హోదా ముగిసిన అధ్యాయం అని కేంద్రం అసత్యాలు పలుకుతుంటే, ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన ఎందుకు ఇంకా వారికి కొమ్ముకాస్తున్నాయని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధించేందుకు నాలుగుసార్లు వచ్చిన అవకాశాన్నివైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎందుకు చేజార్చుకున్నాయని, ఇది వారి రాజకీయ స్వప్రయోజనాల కోసం కాదా అని నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే, ఇక్కడ పరిశ్రమలు ఏర్పడి, యువతకు ఉపాధి లభిస్తుందని జేడీ లక్ష్మీనారాయణ గారు స్పష్టం చేశారు. దీనికోసం పోరాడే ఏ పార్టీతో అయినా, ప్రజా సంఘాలతో అయినా తాము కలిసి పనిచేస్తామన్నారు. సదస్సుకు హాజరైన సిపిఐ నాయకులు నారాయణ గారు,రామకృష్ణ గారు,మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు,చలసాని శ్రీనివాస్ గారు,సిపిఎం నాయకులు శ్రీనివాసరావు గారు,కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు గారు,సుంకర పద్మశ్రీ గారు తదితరులను జేడీ లక్ష్మీనారాయణ గారు ఆప్యాయంగా పలకరించారు
Comments